కరాటే పోటీలు ప్రారంభించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి
వరంగల్ జిల్లా:వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం కాకతీయ పాఠశాల లో ఏర్పాటు చేసిన కరాటే పోటీల కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…
పిల్లలు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, పిల్లలకి ఆటలు, ధ్యానం వంటివి నేర్పిస్తే వారి మేధాశక్తి మరింత మెరుగుపడుతుంది అని అన్నారు.
పిల్లలు పాఠశాల నుండి రాగానే తల్లిదండ్రులు వారికి సమయం కేటాయించి వారికి పాఠశాలలో జరిగిన విషయాలను నెమరువేసే బాధ్యత ఉంది అని పిల్లలు సెల్ ఫోన్ లకి అలవాటు పడకుండా చూసే బాధ్యత మీ పై ఉంది అని అన్నారు.