
బెల్లంకొండ సత్యనారాయణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శికరెంటు కోతలు ఎత్తివేసి చేతికి వచ్చిన పంటలను కాపాడాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతాంగానికి 24 గంటల కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నడిగూడెం మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ ముందు రైతు సంఘం, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలో బెల్లంకొండ సత్యనారాయణ మాట్లాడుతూ పరి పొలాలు పొట్ట దశలో ఉన్నాయని, మిరప తోటలు ఎండిపోతున్నాయని, మామిడి తోటలకు నీళ్లు ఇప్పుడే అవసరమని ఈ పరిస్థితులలో కరెంటు కోతలు ఎత్తివేయాలని లో వోల్టేజ్ సమస్య లేకుండా చూడాలని, ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే వెంటనే రిపేర్ చేయాలని ఆయన అన్నారు. ధర్నా అనంతరం లైన్మెన్ బ్రహ్మచారికి వినపత్రం ఇవ్వడం జరిగింది . ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు, రైతు సంఘం మండల కార్యదర్శి బీరవల్లి సుధాకర్ రెడ్డి, రైతు సంఘం నాయకులు, రేఖ తిరపయ్య, ఎస్కే మస్తాన్, పసుపులేటి వెంకటేశ్వర్లు, సంపత్ పిచ్చయ్య, కాసాని చిన్న బిక్షం, బుల్లి ఎంకన్న,శ్రీను, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.