కలకోవ గ్రామములో గ్రామ కాంగ్రెస్ పార్టీ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది రాజశేఖర్ రెడ్డి ఫోటో కి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించినారు ఈ సందర్భంగా మునగాల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మండవ చంద్రయ్య మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజానీకానికి బడుగు బలహీన వర్గాలకు రైతులకు వృద్ధులకు ఉద్యోగస్తులకు నిరుద్యోగులకు కార్మికులకు కర్షకులకు ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహా నాయకుడు అలాంటి నాయకుడి పోరాట పటిమ నాయకత్వ లక్షణాలు పరిపాలన వారికున్న అనుభవాలను కాంగ్రెస్ పార్టీ గ్రామ గ్రామాన ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త స్ఫూర్తిగా తీసుకొని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమంలో జూకూరి నిరంజన్ మందపల్లి ఉమామహేశ్వరరావు గుండు శ్రీనివాసరావు మండవ లక్ష్మీనారాయణ మందపల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు