
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో మహిళల అభివృద్దికి పెద్ద పీట వేసింది
ఈ69న్యూస్ హన్మకొండ
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని,ఎన్నో పోరాటాల ఫలితంగా నేడు మనం ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని,విద్యా,వైద్య రంగాల్లో మహిళలు ఉన్నత స్థాయికి చేరుకోవాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి వారి కుమార్తె డాక్టర్ నాయిని గోదా రెడ్డి ఆకాంక్షించారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకతీయ విశ్వవిద్యాలయంలో యువజన కాంగ్రెస్ అలువాల కార్తీక్, గోవిందు శ్వేత ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు.జిల్లా ఎమ్మెల్యేలందరం కలిసికట్టుగా యూనివర్సిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని,ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని వెల్లడించారు.రాజకీయాలకు అతీతంగా విద్యా రంగం బలోపేతం కావాలని ఆయన పిలుపునిచ్చారు.రాణిరుద్రమ ఏలిన మన జిల్లాలో వారి పోరాట పటిమను ప్రతిబింబించేలా ఆడపిల్లలు చదువుకోవాలని కోరారు.ప్రజా ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.