telugu galam news e69news local news daily news telugu news
గళం న్యూస్ హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన జోష్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది. తర్వాత లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ చేసింది. లోక్ సభకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వనిస్తోంది. ఆన్ లైన్లో అప్లికేషన్స్ ఫారాలు ఉంటాయని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్ సభకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి ఫీజు తీసుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.25 వేలు, ఇతరులు రూ.50 వేలతో డీడీ తీయాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరారు. గాంధీభవన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో ఈ రోజు నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. వచ్చేనెల 3వ తేదీ వరకు ఆప్లికేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. మరోవైపు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు.