
hanmakonda news
కాజీపేట 62 డివిజన్ సోమిడి కమ్యూనిటి హాల్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో ఎంఎల్ఏ నాయిని..
అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే 6 గ్యారంటీ స్కీమ్ లను అమలు ల్చేస్తామని వాగ్దానం చేసిన నేపథ్యంలో ప్రజా పాలన పేరుతో లబ్దిదారుల నుండి ప్రజాలపాలన దరఖాస్తుల స్వీకరించడం జరుగుతుందని హన్మకొండ 62 డివిజన్ సోమిడి కమ్యూనిటి హాల్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో నాయిని రాజేందర్ రెడ్డి గారు పేర్కొన్నారు.
ప్రజలకు ఏ ఇబ్బందులు ఉన్న ప్రభుత్వం దృస్టికి తీసుకురావాలని, ప్రతి సమస్యపై స్పందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భరోసా ఇవ్వడం జరిగింది. అర్హులైన దరఖాస్తు లందరికి ప్రభుత్వ పథకాలు అందుతాయని ఏ ఒక్కరూ ఆందోళన చెందే అవసరం లేదని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే అది ఖచ్చితంగా చేస్తది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఆరు గ్యారంటీ స్కీం లను అమలు చేస్తాదని మాట ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడ్డాకా తోలి సంతకం ఆరు గ్యారంటి స్కీం లపై తోలి సంతకం చేసారు. ప్రభుత్వం ఏర్పడ్డ రెండు రోజులకే మహిళలకు ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించింది. రెండవది రాజీవ్ ఆరోగ్యశ్రీ ని 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచడం జరిగిందని మిగతావి 100 రోజుల్లో పూర్తి చేస్తామని, కావున ప్రజలు ఈ సంక్షేమ పథకాలను సద్వినియోగంచేసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో 62 వ డివిజన్ కార్పో రేటర్ జక్కుల రవీందర్ యాదవ్, సయ్యద్ విజయశ్రీ రజాలి, కాజీపేట తహశీల్దార్ భావుసింఘ్ మాజీ కార్పోరేటర్ గుంటి కుమార్, సుంచు అశోక్, టిపీసిసి కార్యదర్శి సయ్యద్ రజాలి, మహమ్మద్ అంకుష్, నాగపూరి లలిత, రంగు సుధీర్, బుర్ర బాబు రావు, డివిజన్ అధ్యక్షులు పాలడుగుల ఆంజనేయులు, షేక్ అజ్గర్, పోగుల సంతోష్, కొండా శివ, టిపిసిసి ఎస్.సి. డిపార్ట్మెంట్ కొ-ఆర్డినేటర్ మోసేస్ పాల్ ఆనంద్ కుమార్ (ఏం.పి ఆనంద్) బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బంక సంపత్ యాదవ్, మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.