
కార్పొరేటుకు దీటుగా ప్రభుత్వ గురుకుల పాఠశాలలు
ఈరోజు గురువారందేశాయిపేటలో మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలకు శంకుస్థాపన
-గురుకుల పాఠశాలలో నాణ్యమైన విద్య,వసతి,ఆహారము
-విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు కేసీఆర్ సర్కారు బాటలు
-గతపాలకులు తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధిని విస్మరించారు
-జిల్లాలోనే అత్యుత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నాం
-గతపాలకులు చేసిన అభివృద్ధి నేడు మేము చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా
-ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
వరంగల్ తూర్పు నియోజకవర్గం 12వ డివిజన్ దేశాయిపేటలో మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలకు ముస్లిం మతపెద్దలు,మైనారిటి నాయకులు,కార్పొరేటర్లు,అధికారులతో కలిసి కొబ్బరికాయ కొట్టి పాఠశాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రెసిడెన్షియల్ విద్యా విధానం తీసుకొచ్చిన తర్వాత సమాజంలో వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన పేదలకు విద్యా అవకాశాలు పెరిగాయని తల్లిదండ్రుల పైభారం పడకుండా కార్పొరేట్ స్థాయి విద్యను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందన్నారు.
మన గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు అద్బుత విజయాలను సాధిస్తున్నారని, దేశంలోని ప్రఖ్యాత యూనివర్సిటీలలో సీట్లు వస్తున్నాయని, నీట్, ఐఐటి వంటి అనేక పోటీ పరీక్షలలో నెగ్గుకొస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు.
తెలంగాణ రాకముందు రాష్ట్రంలో కేవలం 10 మైనారిటీ పాఠశాలలు ఉన్నాయని నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన తరవాత 270పైగా మైనార్టీ పాఠశాలలు ఏర్పాటు చేసుకున్నామన్నారు
తూర్పు నియోజకవర్గంలో 7 గురుకులాలు,2 డిగ్రీ కాలేజీలు నెలకొల్పుకున్నామని పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు
స్వాతంత్య్రం వచ్చి ఇన్ని ఏండ్లు గడుస్తున్నా వరంగల్ తూర్పు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని గతపాలకులు హయాంలో మాటలు కోటలుదాటాయి కానీ చేతలు గడపదాటలేదన్నారు
ఇన్నెండ్లు పాలించిన నాయకులు ఈ నియోజకవర్గంలోని పేదల అవసరాలను వాడుకున్నారు,ఆడుకున్నారు తప్ప అభివృద్ధి చేయలేదన్నారు నిరుపేదరికం నుండి ఎదిగిన తనకి పేదోళ్ల కష్టాలు ఏంటో తెలుసని అలాంటి ఇబ్బందులు పేద కుటుంబాలకు రావద్దనే తాపత్రయంతోనే నిద్రాహారాలు మాని నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటు పడుతున్నామన్నారు
ఈ మైనారిటీ స్కూలు,షాధిఖానలు నిర్మించమని తనని ఎవరు అడగలేదని తన వ్యక్తిగతంగా ప్రతిపాదించి నియోజకవర్గ మైనారిటీల కోసం పాటుపడుతున్నామన్నారు గతంలో ఈ ప్రదేశంలో మరొక నిర్మానానికి కేటాయించారని కానీ దీనిలో పాఠశాల నిర్మించాలని ప్రతిపాదించి రాత్రణక పగలనక కష్టపడి ఎందరో అధికారులను సంప్రదింపులు జరిపి ఎంతో శ్రమించి పాఠశాలను సాధించడం జరిగిందన్నారు
తాను ఎమ్మెల్యే అయ్యాక రెండు సంవత్సరాలు కరోనాలు పోయిందని ఒక సంవత్సరం ఎన్నికల దృశ్యా కాలం గడించిందని మిగిలిన సంవత్సరం అభివృద్ధిలో ఎన్నో అద్భుతాలు సృష్టించామన్నారు.
కరోనా సమయంలో ఇప్పుడు కనపడే ఒక్క నాయకుడు కనిపించలేదని నాడు ప్రజలు గోస పడుతుంటే ఒక్కడు కూడా పట్టించుకోలేదని నాడు తనతో పాటు బిఆర్ఎస్ నాయకులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలకోసం కష్టపడ్డారన్నారు
కరోనా సమయంలో తన స్వంత ఖర్చుతో 25వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి వారిని ఆదుకున్నామన్నారు
ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ గారి నాయకత్వంలో జిల్లాలోనే అత్యధిక నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత తనకే దక్కుతుందన్నారు
1100కోట్లతో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,75 కోట్లతో బస్ స్టేషన్,జిల్లా కేంద్రంతో పాటు పాలన సముదాయమైన కలెక్టరేట్ ను పేదల మధ్య తీసుకొచ్చామని ఎమ్మెల్యే అన్నారు
పేద పిల్లలు పోటీ పరీక్షలకు సిద్ధం కావడం కోసం తన స్వంత ఖర్చుతో కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి భోజనం పెట్టి,మెటీరియల్ ఇచ్చి వారికి తోడ్పాటునందించ్చామన్నారు
గతపాలకులు ప్రధాన రహదారులైన పోచంమైదాన్,చౌరస్తా ఇతర రహదారులను అద్వాన్నంగా మార్చి వారి సంపద పెంపొందించుకున్నారు తప్ప పట్టించుకోలేదన్నారు నేడు తాను ఎమ్మెల్యే అయ్యాక ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రోడ్లు అద్దంలా మార్చమన్నారు
మరి గతపాలకులు ఈ సోయి ఎందుకు లేదని ప్రశ్నించారు
నియోజకవర్గంలో కాంగ్రెస్ ఖతం అయిందని,బీజేపీ అడ్రెస్ లేదన్నారు
ఈ రెండు పార్టీల నేతలు ఎన్నికలు వస్తున్నాయని నేడు ప్రజలకు మొఖాలు చూపిస్తున్నారని ఇన్నిరోజులు ఎక్కడ ఉన్నారని ప్రజల బాగోగులు ఎం పట్టించుకున్నారో ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు
బీజేపీ పార్టీ,బీజేపీ నాయకులు ప్రజల మధ్య,మతాల, కులాల మధ్య గొడవలు సృష్టించి పబ్బం గడపడం తప్ప వారు చేసిందేమీ లేదని ఎమ్మెల్యే అన్నారు తాను ఎమ్మెల్యే అయ్యాక కరోనాతో రెండేళ్ల కాలం గడిచిందని మిగతా సమయంలో ప్రజల్లో ఉండి అహర్నిశలు శ్రమించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తున్నామన్నారు ప్రజలంతా గురుకుల పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీ మ్ మసూద్,కార్పొరేటర్లు కావటి కవిత రాజు యాదవ్,సురేష్ జోషి,ఫుర్ఖాన్ ఇతర డివిజన్ల కార్పొరేటర్లు,మాజీ కార్పొరేటర్లు,డివిజన్ అధ్యక్షులు,మైనార్టీ మత పెద్దలు,ప్రభుత్వ అధికారులు,పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ముఖ్య నాయకులు,యూత్ నాయకులుకార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు