
ఈ69న్యూస్ హైదరాబాద్:- కృష్ణానగర్ లేబర్ అడ్డా వద్ద ఎండాకాలంలో కార్మికులకు ఉపశమనం కలిగించేందుకు చలివేంద్రాన్ని ప్రారంభించారు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ మాధురి.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఈ ఏడాది ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కార్మికులు శరీరాన్ని తేమగా ఉంచుకోవడానికి ఎక్కువగా నీరు తాగాలని సూచించారు.మధ్యాహ్నం తీవ్ర ఎండ సమయంలో వీలైనంతవరకూ బయట తిరగకుండా ఉండాలని హెచ్చరించారు.కార్మికుల ఆరోగ్యం,సంక్షేమం దృష్టిలో ఉంచుకుని లేబర్ శాఖ ఎప్పటికప్పుడు శ్రమికుల మేలు కోసం పనిచేస్తోందని ఆమె తెలిపారు.కార్మికులు తప్పనిసరిగా BOC కార్డులు పొందాలని,ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీఐటియు జూబ్లీహిల్స్ జోన్ నాయకులు రాపర్తి అశోక్,కుమార్,కె.యాదగిరి,కె.ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.