
కే.లింగయ్య జిల్లాకన్వీనర్
కే.లింగయ్య జిల్లాకన్వీనర్
చేతివృత్తిదారుల.సమన్వయ కమిటీ……………………. ………
కార్మికులు, కర్షకులు, వృత్తిదారులు దేశవ్యాప్తంగా చేస్తున్న సమ్మెలో భాగంగా
ఈరోజు తేదీ:9-7-2025 న ఐనవోలులోని స్థానిక తాసిల్దార్ కార్యాలయం ముందు cpm. పార్టీ. రైతు సంఘం. గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం మహిళా సంఘం.*kvps *ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది దీనికి ముఖ్యఅతిథిగా చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ కాడ బోయిన లింగయ్య హాజరై మాట్లాడుతూ కేంద్రంలోని అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్మికులకు నష్టం చేసి పెట్టుబడిదారులకు లాభం చేకూర్చే చట్టాలను విధంగా చట్టాలను రూపొందిస్తుందని అన్నారు . ఎన్నో ఏండ్లుగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ సర్కార్ రద్దు చేసి కార్పొరేట్ సంస్థలకు ఉపయోగపడే విధంగా నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చారని వాటి వలన కార్మిక హక్కులు పూర్తిగా హరించబడతాయన్నారు.
కనీస వేతనాలు పొందలేరని, కార్మికులు యూనియన్ పెట్టుకునేటువంటి హక్కు లేకుండా చేస్తుందని, కార్మికులని కట్టు బానిసలుగా చేసేటువంటి ఈ లేబర్ కోడ్ లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ రిజర్వేషన్ లేకుండా చేసేటువంటి విధానాన్ని వ్యతిరేకించాలన్నారు.విద్యుత్ బిల్లులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చింది. ఇది విద్యుత్తు సంస్థను రాష్ట్రాల చేతిలో లేకుండా చేసి కేంద్రం తన గుప్పెట్లకు తెచ్చుకొని కార్పొరేట్ శక్తులకు అమ్మాలని ఈ బిల్లు తీసుకొచ్చారు. పేదలకు, వృత్తిదారులకు ఇచ్చే ఉచిత సబ్సిడీ పథకాలు రద్దవుతాయని తెలియజేశారు. ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ విధానాలు వృత్తిదారులకు ఉరితాళ్ళు గా మారుతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వృత్తిలోకి కార్పొరేట్ శక్తులు ప్రవేశిస్తున్నాయని దీనివల్ల లక్షలాదిమంది వృత్తి దెబ్బ తింటుందని అన్నారు. అన్ని సంఘాలు ఐక్యమై చట్టాలు రద్దు అయ్యేంతవరకు పోరాటం చేస్తామని హెచ్చరించార రైతు సంఘం మండల అధ్యక్షులు మడిగి నాగరాజు మాట్లాడుతూ కేంద్ర బిజెపి సర్కారు లాగానే
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రవర్తిస్తుందని 10 గంటల పని విధానం అమలు జరిగే విధంగా జీవో జారీ చేయడం దుర్మార్గం అన్నారు. వెంటనే విధానాల ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కె నారాయణ రెడ్డి దీకొండ ఉప్పలయ్య కే కవిత. రామ్ కుమార్. లంకల పెళ్లి నరసయ్య. వరి కాల్ గోపాల్ రావు పోచమ్మ సరోజన తదితరులు పాల్గొన్నారు.