
ఈ69న్యూస్ హన్మకొండ:దేశవ్యాప్తంగా జరిగిన కార్మిక సమ్మెకు సంఘీభావంగా తెలంగాణ క్యాబ్ ప్రొటెక్ట్ ట్రేడ్ యూనియన్ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన నాలుగు లేబర్ కోడ్లు కార్మిక హక్కులను హరించేందుకు చేసిన ప్రయత్నమేనని,వీటితో కార్మికులు పెట్టుబడిదారుల చేతిలో బానిసలవుతారని యూనియన్ నాయకులు తీవ్రంగా విమర్శించారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వెల్దండి నాగరాజు,జిల్లా అధ్యక్షులు ఇబ్రాహీంల నేతృత్వంలో నేతలు మాట్లాడుతూ..కేంద్రం రద్దు చేసిన 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలనీ,తాజా లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించాలనీ డిమాండ్ చేశారు.కార్మికులపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను తక్షణమే ఆపాలని వారు హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమంలో కోర్ కమిటీ సభ్యులు పాశికంటి సాయి,సభ్యులు శ్రీనివాస్,రాకేష్,ఫరీద్,రామకృష్ణ,సిల్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.