
కాసాని కాశయ్య గౌడ్ మృతి గ్రామానికి తీరని లోటు
కాసాని కాశయ్య గౌడ్ మృతి గ్రామానికి తీరనిలోటని టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని రత్నవరం గ్రామానికి చెందిన ప్రముఖ గౌడ సంఘం నాయకుడు కాసాని శ్రీను సోదరుడు కీర్తిశేషులు కాసాని కాశయ్య దశదినకర్మకు హాజరై వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో చిలుకూరు మండల జడ్పిటిసి బొలిశెట్టి శిరీష నాగేంద్రబాబు, అనంతగిరి మండల జడ్పిటిసి కొనతం ఉమా శ్రీనివాస్ రెడ్డి, చిలుకూరు మండల ఎంపీపీ పండ్ల ప్రశాంతి కోటయ్య, స్థానిక బిఆర్ఎస్ నాయకులు వీరబాబు, ప్రభాకర్, గోపిరెడ్డి ,మండవ నాగమణి, ఉపాధ్యాయులు వీరబాబు తదితరులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు