
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి
కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ. దేశంలోని 14 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆగస్టు 9, 10 న దేశవ్యాప్తంగా నిర్వహించే మహాధర్నాలను కార్మిక లోకం వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని ఏఐటీయూసీ మండల కార్యదర్శి సారెడ్డి రాఘవరెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక ఏఐటీయూసీ కార్యాలయం నందు మహా ధర్నా గోడపత్రిక ని ఆవిష్కరణ చేసిన అనంతరం వారు మాట్లాడుతూ. నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను తక్షణమే రద్దు చేయాలని, కాంట్రాక్టు విధానాన్ని రద్దుచేసి కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ని వెనక్కు తీసుకోవాలని, పెట్రోల్ డీజిల్ పై అన్ని రకాల పనులు తగ్గించి ఒకే దేశం ఒకే జీఎస్టీని అమలు చేయాలని, రైతాంగానికి కనీసం మద్దతు ధర ప్రకటించాలని, అన్ని రంగాల కార్మికులకు కనీస వేతన చట్టం అమలు చేసి 28 వేల రూపాయలు నెలకు వేతనం ఇవ్వాలని, ఎంబి యాక్టివ్ 2019 ను ఎలక్సిటీ బిల్లు 2022 ను వాపస్ తీసుకోవాలని, తదితర డిమాండ్ల సాధన కోసం ఆగస్టు 9న సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముందు నిర్వహించే మహాధర్నాన్ని జయప్రదం చేయాలని వారు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు జూలకంటి శ్రీను, సతీష్ , మల్లికార్జున్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.