మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి పోడు పట్టాలు పంపించేయడానికి విచ్చేసిన ఐటీ శాఖ మంత్రి తారక రామారావు కు నిరసన ఎదురయింది. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న జర్నలిస్టులకు ఇంటి స్థలాల పట్టాల పంపిణీకి స్థలాలను పరిశీలించి ప్రకటిస్తారని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పడంతో ఎన్నో ఆశలతో వచ్చిన జర్నలిస్టులకు నిరాశ ఎదురైంది..సభలో కేటీఆర్ ప్రకతించకపోవడంతో సభలో మహబూబాబాద్ జిల్లా జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. ఇంటి స్థలాలు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. పండుగ చేసుకోమని చెప్పి దండుగా చేశారని, జర్నలిస్టులను నిరాశపర్చు వద్దంటూ జర్నలిస్టు సంఘాల నాయకులు పేర్కొన్నారు