
జనగామ పట్టణంలోని రెండవ వార్డు మూడో వార్డు లో దుస్థితి పాలకుల అధికారుల నిర్లక్ష్యానికి విసిగివేసారి కుల్లి కంపు కొడుతున్న మోరీలు సాపు చేసుకుంటు పారిశుద్ధ్య పనులు చేసుకుంటున్న స్థానిక ప్రజలు…..*
జనగామ:-జనగామ పట్టణ అభివృద్ధి ఎదుగు బోదుగు లేకుండా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైపోయిందని సిపిఎం జనగామ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి అన్నారు. పాలకులు మాత్రం పరిపాలన గాలికి వదిలేసి క్యాంపు రాజకీయాలు చేస్తున్నారని అధికారులు ప్రజా సమస్యలు తమకేమీ పట్టణ వ్యవహారంగా ఉన్నారని దుయ్యబట్టారు.
ఈరోజు మార్నింగ్ వాగులో భాగంగా రెండో మూడో వార్డుల మద్యన మొరిని సాపు చేస్తూ కనిపించిన రాపాక లక్ష్మణ్ రిటైడ్ టీచర్ గారిని చూసి ఆశ్చర్యానికి గురి అయ్యారని తెలిపారు. లక్ష్మణ్ గారిని అడిగి వివరాలు తెలుసుకున్నాక వారి ఇంటి వెనుక వైపు సందులో మోరి నీళ్లు పోవడం లేదని సంవత్సర కాలంగా అనేక ఇబ్బందులు పడుతున్నామని మోరీలు ఓవర్ లోడ్ లారీల వల్ల పగిలిపోయినాయని మోరి పైన ఉన్న కల్వర్టు కృంగి కూలిపోయిందని దీనివల్ల మురికి కాలువలో వస్తున్న నీరంతా రోడ్డుపైకి వచ్చి దుర్గంధం వస్తుందని దీని ఫలితంగా దోమలు ఈగలు విపరీతంగా ఇళ్లల్లోకి వచ్చి రోగాల బారిన పడుతున్నామని తెలిపారు. ఎన్నిసార్లు ఎవరికి చెప్పినా పట్టించుకోవడంలేదని నాకు వివరిస్తూ వాపోయారు. ఈ సందర్భంగా బూడిద గోపి మాట్లాడుతూ జనగామ పట్టణంలో అభివృద్ధి చెందిన ప్రాంతంగా 2వ 3వ వార్డులు కనబడుతున్నాయి. కూతవేటు దూరంలో కలెక్టర్ ఆఫీసు బస్టాం హైదరాబాద్ హనుమకొండ రోడ్ లో కనెక్టివిటీ ఉన్నప్పటికిని వార్డు లోపటికి పోయి చూస్తే అత్యంత దయనీయ దుస్థితి ఉండదని వర్షాకాలం వస్తే డ్రైనేజీ పొంగి పొరలి చెరువు కుంటలు తలపించే విధంగా ఉంటాయని తెలిపారు తక్షణం మున్సిపాలిటీ కమిషనర్ ఈ వార్డులను సందర్శించి ఖరాబైన మోడీలను కృంగిపోయిన మోరిలను తొలగించి వాటి స్థానంలో నూతన డ్రైనేజీలు నిర్మించాలని ప్రజల అవస్థలు తొలగించాలని డిమాండ్ చేశారు.లేకుంటే ప్రజల సమీకరించి ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.