ఖాదియాన్ లో అహ్మదీయ ముస్లిం జమాత్
అహ్మదీయ ముస్లిం జమాత్ ఇండియా అనుబంధ సంస్థల వార్షిక సమావేశాలు,అహ్మదీయ కమ్యూనిటీ ప్రధాన కేంద్రం ఖాదియాన్లో ఘనంగా నిర్వహించబడ్డాయి.దేశం నలుమూలల నుండి భారీ సంఖ్యలో పురుషులు,మహిళలు,యువత మరియు పిల్లలు ఈ సమావేశాలకు హాజరై సత్రాల ద్వారా ఆధ్యాత్మిక,విద్యా మరియు సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు.అహ్మదీయ కమ్యూనిటీలో సభ్యుల వయస్సు ఆధారంగా మూడు అనుబంధ సంస్థలు పనిచేస్తాయి.అన్సారుల్లాహ్,ఖుద్దాముల్-అహ్మదీయ,లజ్నా ఇమాయిల్లా.వీటి లక్ష్యం సభ్యులకు ఆధ్యాత్మిక,నైతిక,విద్యా మరియు సేవా శిక్షణను అందించడం ద్వారా వారిని సమాజానికి,దేశానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దడం.
అన్సారుల్లాహ్ (పురుషుల వృద్ధ,సీనియర్ విభాగం)
40 ఏళ్లు పైబడి ఉన్న పురుష సభ్యులతో కూడిన ఈ విభాగం,అనుభవజ్ఞులైన సభ్యులను సమాజ సేవలో మరింత సక్రియంగా మారేలా శిక్షణ ఇస్తుంది.వారి అనుభవం యువతకు దిశానిర్దేశం చేసేందుకు ఉపయోగపడేలా కార్యక్రమాలు రూపొందించబడతాయి.
ఖుద్దాముల్-అహ్మదీయ (యువజన విభాగం)
యువతలో ఉన్నత నైతిక ధోరణి,క్రమశిక్షణ,సేవా భావాలపై దృష్టి సారించే ఈ విభాగం కింద, 7-15 ఏళ్ల బాలుర కోసం అత్ఫాలుల్-అహ్మదీయ అనే ప్రత్యేక శిక్షణ విభాగం కూడా కొనసాగుతుంది.
లజ్నా ఇమాయిల్లా (మహిళల విభాగం)
మహిళలు విద్య,కుటుంబ నిర్మాణం,నైతిక విలువల పెంపకం,సేవా కార్యక్రమాల్లో ప్రముఖ పాత్ర పోషించేందుకు లజ్నా ఇమాయిల్లా పనిచేస్తుంది.7-15 ఏళ్ల బాలికల కోసం నాసిరాతుల్-అహ్మదీయ అనే ప్రత్యేక విభాగం ద్వారా చిన్న వయస్సు నుంచే సమగ్ర శిక్షణ అందించబడుతుంది.
సమావేశంలో ప్రత్యేక కార్యక్రమాలు
సమావేశాల్లో విద్యా సెమినార్లు,ప్రసంగాలు,క్రీడా పోటీలు నిర్వహించబడ్డాయి.సభ్యుల వ్యక్తిగత మరియు సామూహిక నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టబడింది.
సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం
సంవత్సరం పొడవునా అనుబంధ సంస్థలు దేశవ్యాప్తంగా శాంతి సందేశాన్ని వ్యాప్తి చేస్తూ,కింది సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాయి.
★ఉచిత వైద్య శిబిరాలు
★బహిరంగ ప్రదేశాల పరిశుభ్రత&వఖార్-ఎ-అమల్” సేవా కార్యక్రమాలు
★రక్తదాన శిబిరాలు
★వృక్షారోపణ
★ఆసుపత్రుల్లో రోగుల పరామర్శ
★అవసరమైన వారికి సహాయ కార్యక్రమాలు
★ఖలీఫా నాయకత్వంలో కార్యక్రమాలు
ఈ మూడు అనుబంధ సంస్థలన్నీ అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ప్రపంచ ఆధ్యాత్మిక అధిపతి 5వ ఖలీఫతుల్ మసీహ్ హజ్రత్ మీర్జా మస్రూర్ అహ్మద్ (అల్లాహ్ ఆయనకు సహాయకుడగుగాక) నాయకత్వంలో పనిచేస్తున్నాయి.ఆయన మార్గదర్శకత్వంలో సభ్యులు దేవుని హక్కులు మరియు మనుషుల హక్కులను నెరవేర్చడంలో తమ బాధ్యతలను మరింతగా తెలుసుకుని సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతున్నారు.ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి సభ్యుడు దేశం,సమాజం పురోగతికి తమ సేవలను అంకితం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.