ఈ69న్యూస్ వరంగల్ ఆగస్టు 29
ఖిలా వరంగల్ తహసీల్దార్ నాగేశ్వర్రావు ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ACB)అధికారులు ఈ ఉదయం సడన్గా సోదాలు నిర్వహించారు.అధికారుల బృందం ఉదయం వేళలోనే తహసీల్దార్ నివాసానికి చేరుకుని,పత్రాలు,ఆస్తుల వివరాలు,నగదు లావాదేవీలపై దర్యాప్తు చేపట్టింది.ప్రాథమిక సమాచారం ప్రకారం,అవినీతి సంబంధిత ఫిర్యాదుల ఆధారంగా ఈ సోదాలు జరుగుతున్నాయని తెలిసింది.ఇంటి అంతటా సోదాలు కొనసాగుతుండగా,తహసీల్దార్ కుటుంబ సభ్యులను కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు.ఆస్తుల విలువ,కదలికలు,అలాగే బ్యాంకు ఖాతాలపై కూడా ఏసీబీ సోదాలు విస్తరించనున్నట్లు సమాచారం.ఈ సోదాల కారణంగా ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.పూర్తి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది.