
గణేష్ మండపాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి: ఎస్. ఐ. ఎం ఏడుకొండలు
శాంతి,సామరస్యానికి మనం పాటుపడాలని,సోదరభావంతో అందరూ కలిసి మెలిసి గణేష్ నవరాత్రులు ఉత్సవాలను జరుపుకోవాలని నడిగూడెం మండల ఎస్.ఐ. ఎం. ఏడుకొండలు సూచించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ప్రశాంత వాతావరణంలో నవరాత్రులు జరుపుకోవాలని ఆయన సూచించారు.మండపాల నిర్వాహకులు నియమ నిబంధనలు పాటించాలని, మండపాల వద్ద డిజెలకు అనుమతి లేదని ఆయన అన్నారు. ఉత్సవాలు భక్తి భావంతో జరుపుకోవాలని అన్నారు.గణేష్ మండపాలు రోడ్డు మధ్యలో ఏర్పాటు చేయవద్దని, వాహనాలకు దారి వదలాలని ఎస్. ఐ కోరారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు సందర్బంగా గణేష్ మండపాల ఏర్పాటుకు, విగ్రహాల ఏర్పాటుకు అనుమతి తీసుకోవాలి.పోలీసు సూచనలు పాటిస్తూ,
ఆన్లైన్ నందు దరఖాస్తు చేసి అనుమతి తీసుకోవాలన్నారు. అన్లైన్ అనుమతి కోసం ఈ లింక్ https://policeportal.tspolice.gov.in/index.htm ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎస్. ఐ తెలిపారు.మండపాలు ఏర్పాటు చేసే స్థలం పబ్లిక్ స్థలం అయితే సంబంధిత గ్రామ పంచాయితీ అనుమతి, ప్రెవేట్ వ్యక్తుల స్థలం అయితే స్థలం యజమాని నుండి అనుమతి పత్రం తీసుకోవాలన్నారు.ఉత్సవాలు ముగిసే వరకు ఉత్సవ కమిటీ సభ్యులు 24 గంటలు మండపాల వద్ద అందుబాటులో ఉండాలని, విద్యుత్ శాఖ అనుమతి ఉండాలన్నారు.