బిఆర్ఎస్ పార్టీలో భారీగా యువ చేరికలు
BRSV పోస్టర్ ఆవిష్కరణ చేసిన గండ్ర దంపతులు

ఈ69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి
భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది.సీనియర్ నాయకులు వాసాల స్వప్న రవి కుమారుడు వాసాల రాజు ఆధ్వర్యంలో,భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 27వ వార్డు,8వ వార్డు (జవహర్ నగర్ కాలనీ) నుండి పెద్ద సంఖ్యలో యువత భారత రాష్ట్ర సమితిలో (బిఆర్ఎస్) చేరారు.ఈ చేరిక కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి,జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి సమక్షంలో వారికి గులాబీ కండువా కప్పి పార్టీ సభ్యత్వం అందజేశారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు కొత్తగా చేరిన యువతకు శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం బిఆర్ఎస్ విద్యార్థి విభాగం చేపట్టిన “తెలంగాణ నీటి హక్కుల కోసం జంగ్ సైరన్ మోగిద్దాం”కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని గండ్ర దంపతులు ఆవిష్కరించారు.విద్యార్థి విభాగం నాయకులు చేపడుతున్న ఉద్యమం ప్రజల మద్దతుతో ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు.