గౌడులు రాజకీయంగా ఎదుగాలి
గోపా హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు డా. బైరి లక్ష్మీనారాయణ గౌడ్, డా. చిర్రా రాజు గౌడ్ ఆధ్వర్యంలో గోపా 23వ కార్తీక వనభోజనాలు వరంగల్ తూర్పు కోటలోని చిల్డ్రన్స్ పార్క్లో ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జనగామ ఆర్టీఓ జీ.వి. శ్రీనివాస్ గౌడ్ హాజరై మాట్లాడుతూ, గౌడుల రాజకీయ అభివృద్ధికి ప్రతి నాయకుడు పెద్ద అన్నగా మారాలని సూచించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా గౌడుల మూల పురుషుడైన కౌండిన్య ముని జన్మదినాన్ని పురస్కరించుకుని కంఠమహేశ్వరస్వామి, సురమాంబ తల్లి, రేణుక ఎల్లమ్మ తల్లి పూజాలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ గౌడ్ మాట్లాడుతూ, గౌడులు చైతన్యవంతమైన జాతి అని, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు తాళ్లపల్లి రవి, కార్పొరేటర్ పోశాల పద్మగౌడ్, బూర విద్యాసాగర్ గౌడ్, తాళ్లపల్లి జనార్దన్ గౌడ్, సంఘం నేతలు, ఉద్యమకారులు, గోపా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర గోపా కార్యనిర్వాహక కార్యదర్శి ముంజ వెంకట్రాజంను ప్రతినిధ్యంగా ఘన సన్మానం చేశారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో జిల్లా నాయకులు, కుటుంబ సభ్యులు కృషి చేశారు.