
గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం నెలకి 26,000గా నిర్ణయించాలి
సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు.పాలకుర్తి నియోజకవర్గం లో గ్రామపంచాయతీ కార్మికుల పాదయాత్ర వాల్పోస్టర్ ఆవిష్కరణ.గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం నెలకు 26,000 లుగా నిర్ణయించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శుక్రవారం పాలకుర్తి మండల కేంద్రంలో
ఈనెల 12 నుంచి పాలకుర్తి నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా వారు పాల్గొని మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఉద్యోగులు కార్మికుల సమస్యల పరిష్కారం డిమాండ్ల సాధన కోసం పోరాటాల పురిటి గడ్డ వీరనారి చిట్యాల ఐలమ్మ స్వగ్రామమైన పాలకుర్తి నుంచి ఈనెల 12న పాదయాత్రను ప్రారంభించుకోవడం జరుగుతుందని వారన్నారు. గ్రామపంచాయతీ కార్మికులు సుదీర్ఘకాలం పోరాటం చేస్తే ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదిక లేకుండా ఆశాస్త్రీయంగా జీవో నెంబర్ 51 తెచ్చిందన్నారు. జీవో నెంబర్ 60 ప్రకారం పారిశుద్ధ్య కార్మికులకు రూపాయలు 16500. కారోబార్ బిల్ కలెక్టర్లకు 19500. కంప్యూటర్ ఆపరేటర్లకు 22,750 వేతనం చెల్లించాలన్నారు. చట్టం ప్రకారం పంచాయతీ సిబ్బందిని అందరినీ పర్మినెంట్ చేసి కారోబార్ బిల్ కలెక్టర్ లకు స్పెషల్ స్టేటస్ కల్పించి వారిని అసిస్టెంట్ కార్యదర్శిలుగా నియమించి ప్రభుత్వ గ్రాంట్ ధర వేతనాలు చెల్లించి ఉద్యోగ భద్రత పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యాలు అమలు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని. మల్టీపర్సేస్ వర్కర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బత్తిని వెంకన్న, గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు సమ్మయ్య,సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చిట్యాల సోమన్న, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులుబసవ రామచంద్రం,గుర్రం లాజర్, గుర్రం రాజు, ప్రతాప్,తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏదునూరి మదర్, మాసంపల్లి నాగయ్య, మంద సంపత్, దండం పెళ్లి సోమన్న, యాకయ్య, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.