
గ్రామ పంచాయతీ భవనం నిర్మాణానికి స్థలం విరాళంగా ఇచ్చిన సర్పంచ్
జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలం తమ్మడపల్లి(జీ) గ్రామ సర్పంచ్ అన్నెపు పద్మ అశోక్ నూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం కోసం తన సొంత డబ్బులతో స్థలం కొని గ్రామానికి విరాళంగా బహూకరించి గ్రామం పై ఉన్న తమ అమితమైన ప్రేమను చూపించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు.సోమవారం పలువురు గ్రామస్తుల,వార్డు మెంబర్ల సమక్షంలో స్థలానికి సంబంధించిన పత్రాలు బహూకరించారు.అనంతరం అశోక్ మాట్లాడుతూ..అనేక రోజుల నుండి గ్రామ పంచాయతీ భవనం అసౌకర్యంగా ఉన్నందున దానిని తొలిగించి,అక్కడే నిర్మాణం చేయవలిసిన భవన నిర్మాణానికి స్థలం విస్తీర్ణం తక్కువగా ఉండడంతో తన సొంత డబ్బులతో కూరపాటి కుటుంబీకుల వద్ద స్థలాన్ని కొనుగోలు చేసి మా తల్లి తండ్రులయిన అన్నెపు దర్గయ్య- నర్సమ్మల జ్ఞాపకర్థం గా అట్టి స్థలాన్ని గ్రామానికి విరాళంగా ఇవ్వడం జరిగిందని అన్నారు.అట్టి స్థలంలో భవన నిర్మాణానికి గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వార 20లక్షల రూపాయల నిధులను సమకూర్చుకొని భవన నిర్మాణ పనులు వేగవతం చేయడం జరుగుతుందని అన్నారు.గ్రామస్తులు సర్పంచ్ అన్నెపు పద్మ అశోక్ కు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ ఎండి షరీఫ్,మహబూబ్ పాష,రాపర్తి చంద్రయ్య,ఆకోజు యాదగిరి,గుండెబోయిన రాజు,కొంతం సోమయ్య,పందిబోయిన యాకయ్య,యాకూబ్ పాష,వేల్పుల రవి,పాక నర్సయ్య,కురపాటి చంద్రమౌళి,రాజేంద్రం,చిట్టిమల్ల కృష్ణ మూర్తి,కసిరబోయిన రాజు,గ్రామ ప్రజలు పెద్దలు పాల్గొన్నారు.