ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు
వర్ధన్నపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎద్దు సత్యం,టౌన్ ప్రసిడెంట్ మైస సురేష్ అధ్వర్యంలో మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ 108 వ జయంతి. కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరిగింది.ఆ మహనీయురాలు చిత్ర పటానికి దండ వేసి పూలు చల్లి ధన్యవాదాలు తెలుపడం జరిగింది.మండల అధ్యక్షుడు ఎద్దు సత్యం, వర్ధన్నపేట టౌన్ ప్రసిడెంట్ మైస సురేష్,ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు, వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య జిల్లా సీనియర్ నాయకులు పోషాల వెంకన్నగౌడ్ లు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు, దళితులతో పాటు మైనార్టీలంతా .దేశాన్ని సమున్నతంగా నిలబెట్టిన మాజీ ప్రధాని ఇందిర గాంధీ 1966 లో ఇందిరా గాంధీ ప్రధాన మంత్రి అయిన నాటికి దేశములో ఆర్థిక మాంద్యం,పారిశ్రామిక ఉత్పత్తుల పతనం,ఎగుమతులు తగ్గడం,ఆహార ధాన్యాల సంక్షోభం ఏర్పడ్డాయి. వీటితో పాటు బడ్జెట్ డేపిసిట్ పెరగడం,విదేశీ ఆర్థిక సాయంపై ఎక్కువగా ఆధారపడటం వంటివే గాక 1962,1965 నాటి యుద్ధాలు, పాకిస్థాన్,చైనా కూటమి ఏర్పాటులో సైన్యం పై ఖర్చు పెంచడం వంటివి జరిగాయి వర్షాలు లేక కరువు ఏర్పడింది.ధరలు పెరిగాయి,పాలన ఖర్చులు తగ్గించుకోవడం వీలుపడలేదు అయినా యుద్ధ ప్రాతిపదికన ఆహార ధాన్యాలు సేకరించి ప్రజలకు పంచి, వారి ప్రాణాలను కాపాడగలిగారు.1970 లో అనేక దేశాలు ఆయిల్ సంక్షోభంలో కొట్టుమిట్టాడిన భారత్ ను మాత్రం ఆ సమస్య నుంచి ఇందిర కాపాడగలిగారు.అదేవిధంగా దేశములోని పేదరికాన్ని ప్రారదోలాడానికి గరిభి హేట్టావో , 20 సూత్రాల పథకం ప్రవేశ పెట్టడమే కాకుండా బ్యాంకులన జాతీయకరణ, రాజభరణాలు రద్దు చేసి ఆదూకున్న ఘనత ఇందిర గాంధీ గారిది.ఈ కార్యక్రమములో కాంగ్రెస్ పార్టీ మహిళా మండల అధ్యక్షురాలు మరుపట్ల అరుణ, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు కుల్ల యాకంతం, ఐనవోలు టెంపుల్ డైరెక్టర్ గుంటి కుమార స్వామి సీనియర్ నాయకులు గుజ్జ రవీందర్ రెడ్డి, మాజీ కో ఆప్షన్ నంబర్ ఎండి అన్వర్,రాజా రాజేశ్వర టెంపుల్ చైర్మన్ మైదం బుచ్చి మల్లు,గడ్డం సమ్మయ్య గౌడ్, దమ్మన్నపేట మాజీ సర్పంచ్ మనోహర్ రెడ్డి,ల్యాబర్తి,అంబేద్కర్ నగర్ ,ఇల్లంద గ్రామ పార్టీ ల అధ్యక్షులు చిదుముల్ల భాస్కర్,సింగపురం ఎలియాస్,ఎద్దు రాజేంద్ర ప్రసాద్,మహిళా నాయకురాండ్లు ,లింగం రజిత రెడ్డి,,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మల్లెపాక సమ్మయ్య,,మరుపట్ల సాయికుమార్,దికొండ ఉపేందర్, సంకినేని దేవేందర్ రావు,రావుల గంగయ్య,గంగరాజు, ,,చిటూరి రాజు, ,ఒగ్గుల మాధవి,బెజ్జం పాపారావు, కట్రియా ల టెంపుల్ చైర్మన్ కట్ట వెంకటయ్య, చిర బోయిన రాజు,మెరుగు రమేష్,తుమ్మల కుమారస్వామి, రాకేశ్ ముదిరాజ్ బండారి యాకయ్య,సంతోష్ ,యాకయ్య,తదితరులు పాల్గొన్నారు