ఘనంగా తెలుగు గళం న్యూస్ 2026 క్యాలెండర్ ఆవిష్కరణ
ప్రజా సమస్యలను నిర్భయంగా వెలుగులోకి తీసుకొస్తూ,సమాజ హితమే లక్ష్యంగా పనిచేస్తున్న తెలుగు గళం న్యూస్ ఆధ్వర్యంలో రూపొందించిన 2026 సంవత్సర నూతన క్యాలెండర్ ను రేగొండ మండలంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో ఘనంగా ఆవిష్కరించారు.ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ముందుగా రేగొండ పోలీస్ స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్సై) రాజేష్ సార్ చేతుల మీదుగా తెలుగు గళం న్యూస్ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎస్సై రాజేష్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను బాధ్యతాయుతంగా సమాజానికి చేరవేయడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు.నిష్పక్షపాతంగా వార్తలను ప్రజల ముందుకు తీసుకువస్తున్న తెలుగు గళం న్యూస్ సేవలు అభినందనీయమని తెలిపారు.అనంతరం రేగొండ ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో దివ్య రావు మేడం చేతుల మీదుగా క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజా పరిపాలనకు మీడియా ఒక కళ్లుగా, చెవులుగా పనిచేస్తోందని అన్నారు. ప్రభుత్వ పథకాలు, ప్రజలకు సంబంధించిన సమాచారం సమగ్రంగా ప్రజల వరకు చేరడంలో తెలుగు గళం న్యూస్ పాత్ర ప్రశంసనీయం అని పేర్కొన్నారు.తదుపరి కార్యక్రమంగా ఉమ్మడి రేగొండ మండలం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏపీఎం ప్రేమ్‌రాజ్ సార్ సమక్షంలో తెలుగు గళం న్యూస్ క్యాలెండర్‌ను ఘనంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఏపీఎం ప్రేమ్‌రాజ్ మాట్లాడుతూ, రైతుల సమస్యలు,వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలను ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో తెలుగు గళం న్యూస్ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో మీడియా సేవలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.ఈ అన్ని కార్యక్రమాల్లో భూపాలపల్లి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కరుణాకర్ రెడ్డి పాల్గొని, తెలుగు గళం న్యూస్ లక్ష్యాలు, సేవల గురించి వివరించారు.తెలుగు గళం న్యూస్ ప్రజా సమస్యలు, సామాజిక అంశాలు, రైతాంగ సమస్యలు, ప్రాంతీయ అభివృద్ధి వార్తలను ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకువస్తోందని తెలిపారు. ప్రజల గొంతుకగా నిలుస్తూ,సత్యం, న్యాయం, ప్రజాహితం అనే విలువలతో ముందుకు సాగుతామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, కార్యాలయ సిబ్బంది, స్థానికులు పాల్గొని తెలుగు గళం న్యూస్ సేవలను అభినందించారు.భవిష్యత్తులో కూడా ప్రజలకు ఉపయోగపడే వార్తలతో, సమాజానికి దిక్సూచిగా నిలవాలని వారు ఆకాంక్షించారు.