
ఘనంగా 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
పామిడి నెహ్రు నగర్ లోని శ్రీ చైతన్య స్కూల్ నందు 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్కూల్ సీఈఓ మరియు డైరెక్టర్ రమణారెడ్డి, సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు 250 అడుగుల జాతీయ జెండాను పామిడి పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలను చేతబట్టి అలాగే పామిడి పట్టణం నందు ఉన్నటువంటి దేశ నాయకుల విగ్రహాలకు పూలమాలలు వేస్తూ నెహ్రు నగర్ నుండి అంబేద్కర్ కూడలి వరకు దేశ నాయకుల నినాదాలు చేసుకుంటూ శ్రీ చైతన్య విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ వేడుకల్లో పామిడి సి.ఐ. రాజశేఖర్ రెడ్డి మరియు పామిడి ఎస్.ఐ చాంద్ భాషా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవాని ఒక ఘనమైన పండుగ నిర్వహిస్తున్నటువంటి శ్రీ చైతన్య యాజమాన్యానికి మరియు విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు అలాగే విద్యార్థులు విద్యార్థులు నిర్వహించినటువంటి సాహసోపేతమైన కృత్యాలు ఎంతోగానో ఆకట్టుకున్నాయని అలాగే ప్రతి ఒక్క విద్యార్థి దేశభక్తి కలిగి ఉండి క్రమశిక్షణ తో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు దేశ నాయకుల యొక్క వేషధారణ ఎంతగానో ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యార్థిని విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.