
చర్ల కుదునూరు కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీ లో చేరికలు
ఈరోజు చర్ల మండలం కుదునూరు గ్రామం లో కాంగ్రెస్ పార్టీ నుండి ముఖ్య నాయకులు కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టే అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై భద్రాచలం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకాట్రావు సమక్షంలో పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. పార్టీలో జాయిన్ అయిన వారు అయినవోలు జగదీష్, సిద్ధి మల్లికార్జునరావు, చల్లా లక్ష్మీనారాయణ, పొగల శ్రీనివాస్, నిట్ట ఇజ్రాయిల్, వనపర్తి శ్రీనివాసరావు, కొక్కెర వంశి, ఎడారి వెంకన్న, వనపర్తి నాగేశ్వరరావు అలాగే ఆర్ కొత్తగూడెం గ్రామం నుంచి బీఎస్పీ పార్టీ మండల కోఆర్డినేటుగా పనిచేస్తూ ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చక బిఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో కెప గణేష్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో చర్ల మండల ప్రధాన కార్యదర్శి పోలిన లంకరాజు, ప్రచార కార్యదర్శి కోటేరు శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఐనవోలు పవన్, యం పి పి గీద కోదండరామయ్య, భద్రాచలం మండల ఉపాధ్యక్షులు నవాబు, కుదునూరు సర్పంచ్ కుంజా కమల, పార్టీ సీనియర్ నాయకులు దొడ్డి తాతారావు, యస్ డి అజీజ్, గోర్ల రాజబాబు, గూడపాటి సతిష్, ఏనుటి జనార్దన్, తుర్రం రవి, సత్యనారాయణరాజు, సిద్ది సంతోష్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు