
హనుమకొండ జిల్లా కేంద్రంలో రైతు సమస్యల మీద చలో కలెక్టరేట్, ధర్నాలో జిల్లా అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వరంగల్ పార్లమెంట్ కాంటెస్ట్ అభ్యర్థి ,పిసిసి మెంబర్ దొమ్మాటి సాంబయ్య గారు పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ
🔥 తెలంగాణ ప్రజలకు ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు రైతులకు ఎరువులు, పురుగుమందులు 100% సబ్సిడీ ఇస్తా అని అధికారంలో వచ్చిన తర్వాత ఇంతవరకు ఆ ఉసు ఎత్తలేదు. రైతులను మోసం చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం
🔥 ప్రత్యేక రాష్ట్రం వస్తే రైతు ఆత్మహత్యలు ఆగుతాయని రైతే రాజు అవుతాడని ప్రజలను నమ్మించి తెలంగాణ లో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అధికారిక లెక్కల ప్రకారం 2800 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలకు కేసిఆర్ పూర్తి బాధ్యత వహించి వారి కుటుంబాలకు తగినంత ఆర్థిక సహాయం అందజేయాలి.
🔥 దేశంలో ఎక్కడా లేనివిధంగా ఖమ్మంలో రైతులు మిర్చి పంటకు గిట్టుబాటు ధర అడిగినందుకు రైతులకు బేడీలు వేసి జైలుకు పంపింన ప్రభుత్వం తెలంగాణలో టిఆర్ఎస్ కెసిఆర్ ప్రభుత్వం.
👉 గతంలో కాంగ్రెస్ పార్టీ YSR ప్రభుత్వంలో రైతులకు పనిముట్ల పైన, ఇతర సామాగ్రి పైన, గ్రిఫ్ట్ ఇరిగేషన్ పైన ఒక్కొక్క రైతుకు 40,000 నుంచి 60 వేల వరకు లబ్ధి చేకూరేది, సబ్సిడీ మొత్తం కాంగ్రెస్ పార్టీ YSR ప్రభుత్వమే భరించేవారు.
🔥 ప్రస్తుతం ఇప్పుడున్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఇట్టి సబ్సిడీలను ఇవ్వకుండా పథకాల పేరు మార్చి ఆచరణకు అమలు కాని పథకాలను తీసుకువచ్చి ఎకరాకు పదివేలు ఇస్తానని పథకం తెచ్చి రైతులను మోసం చేస్తున్నాడు ఇట్టి విషయాన్ని రైతులు అర్థం చేసుకోవాలి.
🔥 YSR ప్రభుత్వంలో ఒకేసారి రైతులకు 60 లక్షల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది.
టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఒక లక్ష రూపాయల రుణమాఫీ విడతలవారీగా చేస్తానని చెప్పి ఇంతవరకు రైతు రుణాలను మాఫీ చేయలేదు.
🔥 కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతులపై కార్లతోటి తొక్కించి రైతులను చంపిన ఘనత కేంద్ర లోని బిజెపి ప్రభుత్వానిది.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రైతు సొంత భూమిలోనే రైతులను కూలీలుగా చేసే చట్టాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ సోనియాగాంధీ నాయకత్వంలో ఉద్యమించి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు రద్దు అయ్యే వరకు సంతకాల సేకరణ చేసి పార్లమెంటులో నల్ల చట్టాలు రద్దు అయ్యే వరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. కాంగ్రెస్ పోరాటాల వల్లనే నల్ల చట్టాలు రద్దు అయినాయి.