చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగించాలని రజక వృతుదారుల సంగము హన్మకొండ జిల్లా కార్యదర్శి కంచర్ల కుమరస్వామి అన్నారు. ఆదివారం ఐలమ్మ వర్దంతి సందర్భంగా రజక సంగము హన్మకొండ మండల కార్యదర్శి పోట్లపెళ్లి రాజు ఆధ్వర్యంలో న్యూశాయంపేట లోని ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలు, ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయన్నారు. తెలంగాణ మట్టిలోనే పోరాటతత్వముందని చెప్పడానికి ఐలమ్మ జీవితమే నిదర్శనమన్నారు. భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం ఆ జన్మాంతం సమ సమాజ నిర్మాణానికి, బడుగు బలహీన వర్గాల భవిష్యత్తుకై, అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా, అకుంఠిత దీక్షతో రజాకార్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన విప్లవ యోధురాలు, మొక్కవోని ధైర్యంతో నిజాం నిరంకుశత్వాన్ని నిరసించిన సివంగి అని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో ఉద్యమ నేత సీఎం కేసీఆర్ గారు ఆమె పోరాటం తత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని ఆమె జీవిత చరిత్రను భావి తరాలకు అందించటానికి పాఠ్య పుస్తకాల్లో చేర్చలన్నారు. ఈ కార్యక్రమంలో జల్లా కమిటీ సభ్యులు పొట్లపల్లి రాజు జిల్లపల్లి మానస సబిత చపాతి సంపత్ దేవేందర్ శ్రీనివాస్ రమేష్ తదితరులు పాల్గొన్నారు