
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధరావత్ తండా శివారు చింత బావి తండా షార్ట్ సర్క్యూట్ వల్ల నిన్న అర్థ రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆశా వర్కర్ కున్సోత్ యాద – విజయల గుడిసె దగ్దం అయింది. ఇంట్లోని సామగ్రి పూర్తిగా కాలి బుడిదయింది. సుమారు 5లక్షల అస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు.
కాగా కట్టుబట్టలతో మిగిలిన ఆ కుటుంబ సభ్యులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గురువారం పరామర్శించారు. నిలువ నీడలేక రోదిస్తున్న కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తక్షణ సహాయం అందించారు. ఆ కుటుంబం తిరిగి నిలబడేలా చూడాలని మంత్రి అధికారులను అదేశించారు.