ద్రానికి చెందిన ముదిరాజ్ సంఘం నాయకులు పొన్నం రాజయ్య కుమారుడు పొన్నం రంజిత్
తెలుగు గళం న్యూస్ స్టేషన్ ఘనపూర్,డిసెంబర్ 02
ఈ రోజు హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ నందు స్టేషన్ ఘణపూర్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రానికి చెందిన ముదిరాజ్ సంఘం నాయకులు పొన్నం రాజయ్య కుమారుడు పొన్నం రంజిత్ అనారోగ్యంతో నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా వైద్య ఖర్చుల నిమిత్తం తెలంగాణ రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ మరియు ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బండ ప్రకాష్ ముదిరాజ్ ని సంప్రదించగా వెంటనే స్పందించి 2 లక్షల రూపాయల ఎల్ఓసి
ఇవ్వడం జరిగింది.అడిగిన వెంటనే 2 లక్షల రూపాయల ఎల్ఓసి ఇచ్చిన బండ ప్రకాష్ ముదిరాజ్ కి ముదిరాజ్ సంఘం నాయకులు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ముదిరాజ్ యుత్ మాజీ అధ్యక్షులు పెసరు సారయ్య,మాజీ యంపిటిసి గోనెల ఉపేందర్,ముదిరాజ్ మహాసభ మండల ఉపాధ్యక్షులు పొన్నం నాగరాజు,నాయకులు పిట్టల మల్లేష్,ఊరడి శ్రీనివాస్,చంద్రయ్య మరియు తదితరులు ఉన్నారు.