
telugu galam news e69news local news daily news today news
చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృత్రిమ పాదాలకు కొలతల శిబిరాన్ని ఆదివారం ములుగు డీఆర్ఎల్ ఫంక్షనల్ లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ మంత్రి ధనసరి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో తమ నియోజకవర్గం లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. గతంలో కరోనా సమయంలో నిత్యావసర వస్తువులు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సుమారు 15వేల నోటు పుస్తకాలు, గోదావరి నదికి వరదలు సమయంలో దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేశారని తెలిపారు. ఈ శిబిరం కు వరంగల్ మహబూబ్ నగర్, జగిత్యాల, కరీంనగర్, సిద్ధిపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సంబంధించిన వారు కృతిమ పాదాల కోసం వచ్చారు. ఈ కృత్రిమ పాదాలకు మార్చి 17 తేదీన పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ డాక్టర్ శ్రీజ, అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రేమలత, చేతన ఫౌండేషన్ సభ్యులు దొడ్డా సీతారామయ్య, ముత్తినేని సురేష్, భూక్యా సత్తు లాల్, చంద్రకాని నవీన్, షేక్ రషీద్, దొడ్డపనేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.