
ఈ69న్యూస్ వరంగల్ జిల్లా,చింత నెక్కొండ:ఇటీవల జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనపై మామునూరు ఎఎస్పీ ఎన్.వెంకటేష్ మరియు పర్వతగిరి సీఐ బి.రాజగోపాల్ స్పందించారు.బాధితురాలిని వ్యక్తిగతంగా కలసి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.అనంతరం గ్రామంలో ప్రజలందరితో కలిసి చైతన్య కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సీసీ కెమెరాల ప్రాముఖ్యత సైబర్ నేరాలు ఎలా జరుగుతాయో,వాటి నుంచి ఎలా జాగ్రత్త పడాలో వివరించారు. అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో శాంతిభద్రతల పరిరక్షణకు అందరూ సహకరించాలని పోలీసు అధికారులు కోరారు.ఈ సందర్భంగా పోలీసు శాఖ ప్రజలకు ఇచ్చిన సందేశం:నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరం.ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని,అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.ఇలాంటి చైతన్య కార్యక్రమాలు పలు గ్రామాలలో కూడా చేపట్టాలని అధికారులు తెలిపారు.