
suryapeat news
మండలం కేంద్రంలో 4 వ నెంబర్ గల చౌక ధరల దుకాణమును తాసిల్దార్
టి.నాగేశ్వరరావు శనివారం ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ మండల కేంద్రంలో నాలుగో నెంబర్ గల చౌక ధరల దుకాణం ఖాళీ ఏర్పడటంతో 2023 ఏప్రిల్ 25వ తేదీన నిర్వహించిన రాత పరీక్ష ఆధారంగా వచ్చిన మార్కులను పరిగణలోనికి తీసుకొని ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అయిన మేరె కల్పన ను డీలర్ గా బాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు. షాప్ నెంబర్ నాలుగు పరిధి లో 690 రేషన్ కార్డులు ఉండగా 104 క్వింటాల 60 కేజీల బియ్యం కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం నాగలక్ష్మి మల్లేష్ యాదవ్, రేషన్ డీలర్ల సంఘం మండల అధ్యక్షుడు వరికల రమేష్, డీలర్ కడప మాధవి,బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బడేటి చంద్రయ్య, మాజీ సర్పంచ్ దున్న సుధాకర్, నాయకులు బొల్లo శ్రీను, దాసరి శీను, జలీల్,బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కాసాని పుల్లయ్య, ప్రధాన కార్యదర్శి బోనగిరి ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.