
జంగేడు పిఎసిఎస్ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రూ.95లక్షలతో నూతనంగా నిర్మించిన జంగెడు పి ఏ సి యసు భవనాన్ని డి సి సి బి చైర్మన్ రవీందర్ రావుతో కలిసి ప్రారంభించిన భూపాలపల్లి శాసన సభ్యులు శ్రీ గండ్ర వెంకట రమణా రెడ్డి , ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు బిఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పరంగా ఏ ప్రభుత్వం చేయనటువంటి పనులు చేస్తూ ప్రజల మనసులో నిలుస్తు, ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ రైతులకు కావలసిన వారికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఏ ప్రభుత్వము చేయనటువంటి అభివృద్ధి చేస్తూ మన రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాలలో ముందు వరుసలో నిలిపిందని తెలిపారు ముచ్చటగా మూడోసారి టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అలవోకుగా గెలుస్తుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ప్రజలు టిఆర్ఎస్ ప్రభుత్వం పై పూర్తి నమ్మకంతో ఉంటూ మన ప్రభుత్వాన్ని ఎల్లవేళలా కాపాడుకుంటూ అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టిఆర్ఎస్ శ్రేణులు,అధిక సంఖ్యలో టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.