జనగామ జిల్లాకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలి
హంసాత్ ఫౌండేషన్ అధ్యక్షులు మహమ్మద్ యాకూబ్ పాషా హైదరాబాద్లో తెలంగాణ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఉబేదుల్లా కోత్వాల్ ని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా మహమ్మద్ యాకూబ్ పాషా మాట్లాడుతూ..ఇటీవల తెలంగాణ ప్రభుత్వం దూదేకులు మరియు ఫకీర్ల మైనార్టీ వర్గాలకు మోపెడ్ వాహనంతో పాటు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించే ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు.ఇప్పటికే చాలామంది తహసిల్దార్ అధికారులు ఇచ్చిన కుల ధ్రువీకరణ ఆధారంగా దరఖాస్తులు సమర్పించినట్లు తెలిపారు.తహసిల్దార్ జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రాలను పరిగణనలోకి తీసుకుని లబ్ధిదారులను ఎంపిక చేయాలని కోరుతూ..జనగామ జిల్లాలో ముస్లిం మైనార్టీలు తీవ్ర వెనుకబడిన ప్రాంతంగా ఉన్నందున ఈ పథకం కింద అత్యధిక శాతం లబ్ధిదారులను ఈ జిల్లాకు కేటాయించాల్సిన అవసరం ఉందని తెలిపారు.ఇందుకోసం జనగామ జిల్లాకు ప్రత్యేకంగా బడ్జెట్ పెంపు చేయాలని చైర్మన్ ని వినతిపత్రం ద్వారా కోరారు.ఈ సందర్భంగా తన అభ్యర్థనపై చైర్మన్ ఉబేదుల్లా కోత్వాల్ సానుకూలంగా స్పందించినట్లు యాకూబ్ పాషా తెలిపారు.