
ఈ69 న్యూస్ జనగామ,ఆగస్టు 13
జనగామ జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్,వాస్తు గణపతి దేవాలయం వద్ద బుధవారం విద్యార్థులకు డ్రగ్స్ మానవ ఆరోగ్యంపై కలిగే హానికారక ప్రభావాలపై అవగాహన కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు.కార్యక్రమంలో పాల్గొన్న పోలీసు అధికారులు విద్యార్థులకు మత్తు పదార్థాల దుష్ప్రభావాలు,చట్టపరమైన శిక్షలు,వాటి నుండి దూరంగా ఉండాల్సిన అవసరం గురించి వివరిస్తూ,మంచి భవిష్యత్తు కోసం మత్తు పదార్థాలను పూర్తిగా వదిలేయాలని పిలుపునిచ్చారు.