
jangoan news

ఈ69న్యూస్ జనగామ
జనగామ వ్యవసాయ మార్కెట్ పరిధిలో అవినీతిపై విజిలెన్స్ విచారణ జరిపించాలని,సిసిఐ పత్తి కొనుగోలు,పల్లికాయ కొనుగోలులో జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరిపించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది.నెల్లుట్ల మణికంఠ రైస్ మిల్లును బ్లాక్‌లిస్ట్ చేయాలని,మద్దతు ధర రూ.1850కు ధాన్యం కొనుగోలు చేయాలని,జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు తక్షణమే ప్రారంభించాలని కోరుతూ కలెక్టరేట్ సూపరిండెంట్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా భూక్యా చందు నాయక్ మాట్లాడుతూ,సీసీఐ ద్వారా కొనుగోలైన పత్తిలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, మార్కెట్ అభివృద్ధికి 11 కోట్ల ఆదాయం ఖర్చు కాలేదని ఆరోపించారు.2023-24,2024-25 ఆర్థిక సంవత్సరాల ఆడిట్ జరిపి విచారణ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం,రైతు సంఘం నాయకులు అజ్మీరా సురేష్ నాయక్,మంగ బీరయ్య,బోడ రాములు,ఉర్సుల కుమార్ తదితరులు పాల్గొన్నారు.