
జఫర్గడ్ నూతన ఎస్సైగా పదవీ బాధ్యతలు చేపట్టిన- ఎం.మహేందర్
జనగామ జిల్లా జఫర్ఘడ్ మండల పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్సైగా ఎం మహేందర్ శుక్రవారం పదవీ భాధ్యతలు చేపట్టారు.మహేందర్ గతంలో ములుకనూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా విధులు నిర్వహించారు.కాగా గతంలో
జఫర్ఘడ్ ఎస్సైగా విధులు నిర్వహించిన బి.శంకర్ నాయక్ సిఐ గా ప్రమోషన్ పొంది సిసిఎస్ వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు.