
ఈ69న్యూస్ న్యూస్ జనగామ/జఫర్గఢ్,జూలై 29
జనగాం జిల్లా జఫర్గఢ్ మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాల లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర ప్రవేశాల కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ తెలియజేసిన వివరాల ప్రకారం,ఎంపీసీ మరియు బైపిసి కోర్సుల్లో చేరాలని ఆసక్తి కలిగిన విద్యార్థులు జూలై 31న ఉదయం 9 గంటల లోపు తమ అసలు సర్టిఫికెట్లతో పాటు నేరుగా కళాశాలకి హాజరుకావలసి ఉంటుందని పేర్కొన్నారు.స్థానాల పరిమితిని దృష్టిలో ఉంచుకుని,వెరిఫికేషన్ ప్రక్రియ ప్రాధాన్యత క్రమానుసారంగా జరుగుతుందని వారు పేర్కొన్నారు.ప్రవేశం కోరే విద్యార్థులు అవకాశం కోల్పోకుండా తక్షణమే స్పందించాలని సూచించారు.