జఫర్ఘడ్ జనవరి02
రాష్ట్రంలోని సర్పంచ్ల సమస్యలపై ధర్నాచౌక్ వద్ద సోమవారం రోజున కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో జఫర్ గడ్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.ఈ సందర్భంగా స్టేషన్ ఘనపూర్ మాజీ మార్కెట్ చేర్మెన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అన్నేబోయిన బిక్షపతి మాట్లాడుతూ..రాష్ట్రంలో సర్పంచుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని స్థానిక సంస్థలు గ్రామ పంచాయతీలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు.నిధులు విడుదల చేసి పంచాయతీలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.సర్పంచులు అప్పుల పాలై తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్లకు ఇఎంఐ కట్టలేని పరిస్థితి నెలకొందని ఆరోపించారు.పంచాయతీ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం గత 7 నెలలుగా పెండింగ్ లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని,లేని యెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రేస్ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అధ్యక్షులు తాటికాయల రాజేందర్ ఉప సర్పంచ్ నంచర్ల యాదగిరి గ్రామశాఖ అధ్యక్షులు మామిడి శ్రీనయ పాల్గొన్నారు.