
ఈ69న్యూస్ హన్మకొండ/బ్యూరో రిపోర్టర్ దుర్గా ప్రసాద్
హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలానికి చెందిన జయగిరి గ్రామంలో జన వికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జలదానం కార్యక్రమం నిర్వహించారు.రేణు కుంట్ల దీపిక తన భర్త కీర్తిశేషులు రేణు కుంట్ల నవీన్ జ్ఞాపకార్థంగా ఈ కార్యక్రమానికి దాతగా ముందుకు వచ్చారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన బాలవికాస మండల కోఆర్డినేటర్ అలువాల శోభ మాట్లాడుతూ..వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి అందించటం ఎంతో పుణ్యకార్యమని పేర్కొన్నారు.దాతల సహకారంతో ఇటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బాలవికాస కోఆర్డినేటర్లు,మహిళా సభ్యులు,ఆటో యూనియన్ సభ్యులు,గ్రామస్తులు పాల్గొన్నారు.