
చిన్న పత్రికలను ఆదుకోవాలి
చిన్న పత్రికలను ఆదుకోవాలి
సమాచార శాఖ కమీషనర్ కు టీడబ్ల్యూజేఎఫ్ విజ్ఞప్తి
E69NEWS హైదరాబాద్
రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ రాష్ట్ర సమాచార,పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ సీహెచ్ ప్రియాంక ను కోరారు.శనివారం ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య,ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం,బండి విజయ్ కుమార్,నేషనల్ కౌన్సిల్ సభ్యులు కుడితాడు బాపురావు,పద్మనాభరావు తదితరులు కలిసి బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా రాష్ట్రలో ప్రధానంగా చిన్న పత్రికల యజమానులు,సంపాదకులు,విలేకరులు ఎదుర్కొంటున్న సమస్యలను మామిడి సోమయ్య కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు.గత సంవవత్సరం కాలంగా ప్రభుత్వం నుంచి రావలసిన ప్రభుత్వ ప్రకటనల బిల్లులు రాకపోవడం వల్ల చిన్న పత్రికల యజమానులు తీవ్ర ఇంబ్బందులు ఎదుర్కొంటున్నారని,అదే విధంగా ఆర్ ఎన్ ఐ గుర్తింపు పొంది రెగ్యులారిటీ ఉన్న చిన్న, మధ్య తరహా పత్రికలను ఎంపానల్ చేయాలని కోరారు.జర్నలిస్టులపై దాడులు,హెల్త్ కార్డులు,అక్రెడిటేషన్ కార్డులు తదితర అనేక సమస్యలను కమీషనర్ దృష్టికి తీసుకెళ్లారు.ఈ సమస్యలకు సంబంధించి ఆమె అన్ని విషయాలపై సానుకూలంగా స్పందించారు.