జాతీయ గణిత శాస్త్ర దినోత్సవ వేడుకలు
వరంగల్ మున్సిపాలిటీ లోని 14వ డివిజన్లో గల శ్రీ సాయి విజ్ఞాన భారతి హైస్కూల్ నందు జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం మరియు గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి ఉత్సవాలను రామానుజన్ గారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నిర్వహించినట్లు పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ సామల శశిధర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గణిత శాస్త్రానికే వన్నెతెచ్చిన శ్రీనివాస రామానుజన్ డిసెంబర్ 22 1887న తమిళనాడులో జన్మించారు. వీరి తల్లిదండ్రులు కొమథ తమ్మల్, శ్రీనివాస్ అయ్యంగార్ రామానుజన్ కి చిన్ననాటి నుండే గణితం అంటే చాలా ఆసక్తి తను మిగతా అన్ని సబ్జెక్టులలో ఫెయిల్ అయినా గణితంలో మాత్రం పాస్ అయ్యేవాడు. అలా పై చదువులు చదవలేక పోవడం వల్ల తనకు ఎక్కడా ఉద్యోగం దొరకలేదు,కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సైతం ఎంతోమంది రామానుజన్ గురించి గొప్పగా చెప్పుకునే వారు. అంతటి గొప్ప మేధావి అయిన రామానుజన్ గారి జయంతి రోజున జాతీయ గణిత దినోత్సవం గా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని విద్యార్థులకు ఆయన ఒక స్ఫూర్తిదాయకమని నేటి యువతకు మార్గదర్శి అని శశిధర్ రెడ్డి తెలిపారు. పాఠశాల విద్యార్థిని విద్యార్థులచే గణిత నమూనాలను తయారు చేయించి పాఠశాలలో ప్రదర్శించారు.విద్యార్థిని,విద్యార్థులకు మిఠాయిలు పంచారు.అనంతరం ఉత్తమ గణిత నమూనాలను ఎంపిక చేసి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయనీలు ఎస్.స్వాతి,ఎం.రాధ,రిజ్వానా, ఫాతిమా,శ్రావణి,నేహ,చందన మరియు విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.