జాతీయ రోడ్డు మహోత్సవ ర్యాలీ
తెలంగాణ రాష్ట్ర క్యాబ్ ప్రొటెక్ట్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు మహోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు.రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడం,వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ ర్యాలీని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ..రోడ్డు ప్రమాదాలను నివారించడంలో ప్రతి వాహనదారుడి బాధ్యత కీలకమని అన్నారు.ముఖ్యంగా క్యాబ్ డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తూ ప్రయాణికుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.ర్యాలీలో వరంగల్ జిల్లా అధ్యక్షుడు హరీష్,జనరల్ సెక్రటరీ ప్రవీణ్,వర్కింగ్ ప్రెసిడెంట్ చారి,కృష్ణ,రాజేష్,మురళి,సర్వర్,రియాజ్,వంశీ తదితర టీఆర్సీపిటీయూ నాయకులు,సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ప్లకార్డులు,నినాదాల ద్వారా రోడ్డు భద్రత సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు.ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ..క్యాబ్ డ్రైవర్ల సంక్షేమంతో పాటు సమాజ భద్రతకు కూడా ట్రేడ్ యూనియన్ కట్టుబడి ఉందని తెలిపారు.భవిష్యత్తులో కూడా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.