జిల్లాలో రెవెన్యూ సదస్సులు– భూ సమస్యల పరిష్కారంపై మంత్రి ఫోకస్
ఈ69న్యూస్ జనగామ:-మే 5 నుంచి 20 వరకు జిల్లాల్లో మండలస్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.భూ భారతి చట్టం కింద వచ్చిన దరఖాస్తులను జూన్ 2లోపు పరిష్కరించాలని ఆదేశించారు.భూ సేకరణ,హెల్ప్ డెస్క్,పట్టాల చిట్టాలు,రికార్డుల అప్డేట్పై అధికారులకు సూచనలు ఇచ్చారు.నీట్ పరీక్షకు కేంద్రాల్లో త్రాగునీరు,శుచిత్వం,మెడికల్ సదుపాయాలు,సీసీటీవీ, పోలీస్ భద్రత ఏర్పాటు చేయాలన్నారు.ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి వేగం పెంచి మే 10 లోపు నిర్మాణం ప్రారంభించాలన్నారు.