
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా అల్వాల లక్ష్మయ్య
సెప్టెంబర్ 5 డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినోత్సవమైన జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని, మహబూబాబాద్ జిల్లా లో బాలాజి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మహబూబాబాద్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం 2023 నూ ,మహబూబాబాద్ శాసనసభ్యులు శంకర నాయక్, జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు చేతుల మీదుగా మరిపెడ మండలంలోని రాంపురం గ్రామంలోని తేజస్వి స్కూల్ ప్రధానోపాధ్యాయులు అలువాల లక్ష్మయ్య కి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ అవార్డు మాపై మరింత బాధ్యత పెంచిందని అన్నారు.ఈ సందర్భంగా వారిని రాంపురం గ్రామ సర్పంచ్ రామసాయం లావణ్య నరసింహారెడ్డి, కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాంపల్లి రవి గౌడ్,ఎంపీటీసీ కొమ్ము నరేష్, దోమల లింగన్న గౌడ్,బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బందు పరశురాములు తదితరులు అభినందించారు.