
జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ప్రభుత్వ స్థలాలలోని ఉన్న బస్తీలలో ఉండే వారందరికీ జీవో 58 కింద పట్టాలు ఇవ్వాలని సిపిఎం జూబ్లీహిల్స్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ ఎమ్మార్వో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది జీవో 58 కింద ఈ నెల 16 నుంచి 30 వరకు అప్లికేషన్లకు అవకాశం ప్రభుత్వం కల్పించింది దీనిని మే నెల మొత్తం పొడిగించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ నెలలో ప్రభుత్వ హాలిడేస్ సెలవులు ఎక్కువగా ఉన్నందున పేదలందరికీ అప్లికేషన్ పెట్టుకోవడానికి గడువు పెంచాలని డిమాండ్ చేశారు. ఇంతకుముందు అప్లికేషన్ పెట్టుకున్న వారికి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోకుండా పాత అప్లికేషన్లనే ఓకే చేసి సర్వే చేయాలని తెలిపారు. స్థలం ఉండి రేకుల ఇల్లు ఉన్న ఉన్నటువంటి వారందరికీ గౌరవ ముఖ్యమంత్రిkcr గారు ఇస్తా అన్న మూడు లక్షల స్కీం కు అప్లికేషన్లు వెంటనే తీసుకోవాలని తెలిపారు. ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు రాపర్తి అశోక్, టి సాయి శేషగిరిరావు, జి స్వామి ,జి కిరణ్ ,సికిందర్ తదితరులు పాల్గొన్నారు.