
telugu galam news e69news local news daily news today news
తప్పడు ఆర్డర్లు ఇచ్చిన భద్రాచలం మొబైల్ కోర్టు మాజీ జడ్జిలు Ch వెంకటేశ్వర్లు మరియు శివాజీల పై చట్ట పరమైన చర్యలు తీసుకొవాలని డిమాండ్
మొబైల్ కోర్టు మాజీ జడ్జిలు Ch వెంకటేశ్వర్లు మరియు శివాజీలు ఇచ్చిన ఆర్డర్ లను మరల పరిశీలించి తగు చర్యలు తీసుకొని న్యాయం చేయాలని వినతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటిడిఏ మొబైల్ కోర్టు లో మాజీ జడ్జిలు వెంకటేశ్వర్లు మరియు శివాజీలు డబ్బుకు అమ్ముడు పోయి డాకుమెంట్స్ పరిశీలించకుండా ఏక పక్షంగా ఇచ్చిన తప్పుడు ఆర్డర్లు లను తక్షణమే ఎంక్వయిరీ చేసి అవినీతిని పాల్పడిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ITDA PO గారికి పిర్యాదు చేసిన ఆదివాసి నాయకులు, ఊకె ముక్తేశ్వర్ రావు ఆధ్వర్యంలో ఆదివాసులు పెద్ద ఎత్తున భద్రాచలం ఐటిడిఏ ప్రజా గ్రీవెన్స్ యందు పిఓ గారిని కలిసి, ఆదివాసులకి జరిగిన అన్యాయం గురించి వివరించడం జరిగింది, Case OS no 365/2022 లో ఇంజక్షన్ ఆర్డర్ మరియు పోలీస్ ప్రొటెక్షన్ లను మా యొక్క రికార్డు మా యొక్క సాక్షాలు ఏది కూడా పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకొని డిక్రి ఆర్డర్ ఇచ్చిన మొబైల్ కోర్టు జడ్జి లు శివాజీ Ch వెంకటేశ్వర్లు, అడ్వకేట్ MV ప్రసాద్ మరియు కొంతమంది అడ్వకేట్స్ లపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదివాసి నాయకులు డిమాండ్ చేయడం జరిగింది, ములకలపల్లి మండలం పరిధిలోని భూములు , మరియు సంస్థాన్ పాల్వంచ పరిధి భూములు పూర్తి 5th షెడ్యూల్ ఏరియా అయిన ప్పటికీ మొత్తం కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారు, కాబట్టి దీనిపై తగు విచారణ జరిపి చట్ట పరమైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయగలరని భద్రాచలం ITDA PROJECT OFFICER గారికి పిర్యాదు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆదివాసి రాష్ట్ర నాయకులు ఊకె ముక్తేశ్వర్ రావు, బాడిశ బిక్షం దొర, సోయం చిన్నారి కుంజ రవి శెట్టిపల్లి రజిని తాటి నాగరాజు ఊకె పెద్దమ్మాయి, సోయం కృష్ణ కుమార్, ఒగ్గేల భద్రయ్య, తానం లక్ష్మి ఆదివాసీ నాయకులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు