వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సివల్ సెక్రటరీ
మా యొక్క సర్వీస్ సుమారుగా 20 సంవత్సరాలు దాటినది. ఇంతవరకు ఎటువంటి ప్రమోషన్ లేదు. 2021 మరియు 2024 సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించినటువంటి నర్సింగ్ సిబ్బందికి గవర్నమెంట్ కాలేజీలలో ప్రమోషన్ ద్వారా ప్రభుత్వ సర్సింగ్ కళాశాలలో పనిచేయడానికి ప్రభుత్వం ఈ మధ్యకాలంలో నిర్ణయం తీసుకోవడం జరిగినది. కావున మా యందు దయవుంచి ఈ అవకాశాన్ని మాలాంటి 20 సంవత్సరాల గవర్నమెంట్ సీనియారిటీని మరియు క్లినికల్ బెడ్ సైడ్ అనుభవం కలిగినటువంటి నర్సింగ్ సిబ్బందిని గుర్తించి కనీసం ఐదు సంవత్సరాల నుండి 20 సంవత్సరాల వరకు పైబడినటువంటి సీనియర్ నర్సింగ్ సిబ్బందికి ఇప్పించవలసినదిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇన్ సర్వీస్లోలో హయ్యర్ ఎడ్యుకేషన్‌కి శాలరీతో కూడినటువంటి ఎడ్యుకేషనల్ సెలవులు ఇప్పించగలరని. నర్సింగ్ పీజీ చేయడానికి తెలంగాణలో ఉస్మానియా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తప్ప మరొకటి లేదు.
కావున ఎక్కువ మొత్తంలో నర్సింగ్ కళాశాలలకు పీజీ కోర్సులను అనుమతి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి.
కోర్కెలు :
- టీచింగ్ సైడ్ ప్రమోషన్స్ బీఎస్సీ కంప్లీట్ చేసిన వాళ్ళకి కల్పించాలి..
2 హయ్యర్ ఎడ్యుకేషన్ కి శాలరీతో కూడినటువంటి సెలవులు ఇవ్వాలి. - కొత్తగా పీజీ నర్సింగ్ విద్య కొరకు 10 కాలేజీలకు అనుమతి ఇవ్వాలి.
- నర్సింగ్ కాలేజీలకు మరియు హాస్టల్స్ కోసం అద్దె భవనాలు కాకుండా గవర్నమెంట్ సొంత భవనాలను ఏర్పాటు చేయాలి.
- నర్సింగ్ డైరెక్టరను ఏర్పాటు చేయాలి.
- బిఎస్సి నర్సింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి పీహెచ్ అండ్ టిగా 50% క్లినికల్ సైడ్ 50% ఫీల్డ్ సైడ్ ప్రమోషన్స్ ఇవ్వాలి.
- గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్‌లను జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలి.
- బీఎస్సీ నర్సింగ్ మరియు ఎమ్మెస్సి నర్సింగ్ చేయడానికి ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ సీట్లను పెంచాలి.
- నర్సింగ్ సంబంధించిన అన్ని విభాగాలలో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ విభాగాలలో కేడర్స్ స్ట్రెంత్ పెంచాలి.
- ఆధార్ బెసేడ్ అటెండెన్స్న నిలిపివేయాలి.