
తేది: 28-11-2022
NEP తో విద్యారంగంలో అసమానతలు పెంచెందుకు ప్రయత్నం..
ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి వడ్రనపు మధు..
ఖమ్మం :- ASR కాలేజీలో నూతన విద్యా విధానం పై సెమినార్ నిర్వహించడం జరిగింది.. ఈ సెమినార్ లో ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి వడ్రనపు మధు ఈ సెమినార్ ఉద్దేశించి మాట్లాడారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ :- దేశంలో విద్యా వ్యాపారీకరణ, కార్పోరేటీకరణ, విద్యారంగంలో కషాయికరణకు వ్యతిరేకంగా ఉద్యమించాలి.. దేశ విద్యారంగంలో NEP పేరుతో అసమానతలు పెంచి, విభజన చేసే విధానాలను బిజెపి తీసుకుని వస్తుంది.. ప్రభుత్వ విద్యారంగాన్ని విస్మరించి కార్పోరేట్ శక్తులకు విద్యారంగాన్ని ధరాదత్తం చేస్తుంది.. అలాగే దేశంలో గత 8 యేండ్లలో బిజెపి ప్రభుత్వం విద్య,ఉపాధి రంగాలను నిర్లక్ష్యం చేసిందని అన్నారు… యూనివర్శీటీలను నిర్లక్ష్యం చేస్తూ నిధులు ఇవ్వకుండా భారీగా ఫీజులు పెంచి విద్యకు పేద ప్రజలను దూరం చేసే విధానాలు చేపడుతుందని ఆయన అన్నారు.. నూతన విద్యావిధానం పేరుతో ఆరెస్సెస్ భావాజాలన్ని విద్యలో ప్రవేశపెట్టి సిలబస్ మార్చివేసి, చరిత్రను వక్రీకరిస్తుందని అన్నారు. దేశంలో ఉన్న ఉన్నత స్థాయి విద్యాసంస్థలలో ఫ్రోఫెసర్ పోస్టులు భర్తీ చేయకుండా ఉన్నత విద్యలో అణాగారిన వర్గాలకు ఈ విద్యాసంస్థలలో స్థానం లేకుండా చేస్తున్నారు. ఆరెస్సెస్ చెందిన వ్యక్తులను యూజీసీ చైర్మన్ గా నియమించి యూనివర్శీటీలలో ప్రజాస్వామ్య వాతవరణాని లేకుండా చేస్తుందని ఆయన అన్నారు… అనంతరం ఏ.ఎస్.ఆర్ కాలేజీ లో 15 మందితో కాలేజీ కమిటీ ఎన్నిక కావడం జరిగింది.. అధ్యక్ష కార్యదర్శులుగా శ్రీనివాస్ శ్రీకాంత్, గర్ల్స్ కన్వీనర్ గా వినీల ఎన్నిక కావడం జరిగింది.. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి పునుగుల సుధాకర్, ఖమ్మం నగర కన్వీనర్ తరుణ్, ఎస్ఎఫ్ఐ నాయకులు రాజు, గోవర్ధన్, నితిన్, లక్ష్మీ ప్రసన్న, అనిత, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు..