
కాంగ్రెస్ పార్టీ డోర్నకల్ లో గెలవాలంటే – భూపాల్ నాయక్ గారికి టికెట్ ఇవ్వాల్సిందే….
భూపాల్ నాయక్ టీమ్ సిరోలు మండల ఇన్చార్జి- బానోతు విష్ణు నాయక్…..
(కూరవి::14 /10/2023 శనివారం …)
ఈరోజు సీరొల్ మండల కేంద్రంలోని చింతపల్లి గ్రామం భూపాల్ నాయక్ టీమ్ మండలం ముఖ్య నాయకుల సమావేశం లో NCWC మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు.. జేరిపోతుల రంగన్న గౌడ్.. *మండల ఇంఛార్జి విష్ణు నాయక్ మాట్లాడుతూ…
డోర్నకల్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే,కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే, నానావత్ భూపాల్ నాయక్ గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించాలని మండల ఇంఛార్జి లు , రంగన్న గౌడ్ మరియు విష్ణు నాయక్ లు తెలిపారు ….. అదేవిధంగా దశాబ్దల కాలం నుండి డోర్నకల్ నియోజకవర్గ ప్రాంతం చాలా వెనుకబడి ఉందని, గత 30 సంవత్సరాల అభివృద్ధిలో ఫలితం శూన్యమని అన్నారు…
ప్రభుత్వం చేయాల్సిన పనులే , ఏ అధికారం లేకుండా ఐదు పంచ సూత్రాలతో భూపాల్ నాయక్ డోర్నకల్ నియోజకవర్గం అభివృద్ధికి జూనియర్ కళాశాల, యువతకు ఉపాధి అవకాశాల కోసం సాఫ్ట్వేర్ కంపెనీ నిర్మాణం, రైతులకు ప్రయోజనం చేసే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, పామాయిల్ కంపెనీ , ఏడు మండలాల కేంద్రాల్లో ఉచిత ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయడం అధికారంలో ఉన్న పార్టీ కూడా సాధ్యం కాదని తెలిపారు…కానీ భూపాల్ నాయక్ తన సొంత ఖర్చులతో ఈ ఐదు పంచ సూత్రాలు విద్యా, వైద్యం, ఆరోగ్య, ఉపాధి, కల్పించడం అంటే డోర్నకల్ నియోజకవర్గ ప్రజలకు భూపాల్ నాయక్ లాంటి వ్యక్తి దొరకడం అదృష్టమని తెలిపారు….
తప్పకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూన్న భూపాల్ నాయక్ గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించాలని కోరారు…
ఈ కార్యక్రమంలో మండల చింతపల్లి గ్రామ ముఖ్య నాయకులు, బోడ బాలాజీ నాయక్, భూక్య గణేష్ నాయక్, రవి నాయక్, అఖిల్, అశోక్ నాయక్ తదితరులు పాల్గొన్నారు..